Parvathipuram: రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా పట్నాయకుని నాగమణి
Parvathipuram: ఏపీ ఆహార, పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా పట్నాయకుని నాగమణి నియామకం. కలెక్టర్ ప్రభాకర రెడ్డి, జేసీ వైశాలిని కలిసిన నాగమణి.
Parvathipuram: రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా పట్నాయకుని నాగమణి
పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ పరిధిలోని రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ (State Level Vigilance Committee) నాన్-అఫీషియల్ సభ్యురాలిగా పార్వతీపురం మన్యం జిల్లా నుండి శ్రీమతి పట్నాయకుని నాగమణి గారు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జూన్ 30, 2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా పట్నాయకుని నాగమణి బుధవారం జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి గారికి, జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి గారికి గౌరవ పూర్వకంగా కలిశారు.
గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన పట్నాయకుని నాగమణి గత మూడు దశాబ్దాలుగా ఉమ్మడి విజయనగరం, ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవలందిస్తున్నారు. 1989 నుండి మహిళా చైతన్యం, స్వయం ఉపాధి, మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయడంతో పాటు, 2000 సంవత్సరం నుండి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టాలపై విస్తృత అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
గతంలో ఆమె గుమ్మలక్ష్మీపురం MCIC గా, ఫుడ్ కమిటీ (DCPC) మెంబర్‌గా, రాష్ట్ర వినియోగదారుల సంఘాల వైస్ చైర్మన్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. సివిల్ సప్లైస్ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ ద్వారా ఇప్పటివరకు సుమారు 50 కి పైగా అవార్డులను అందుకున్నారు.
తన నియామకానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి నాగమణి గారు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వినియోగదారుల రక్షణ చట్టాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రభుత్వ సహకారంతో ఆహార భద్రత పర్యవేక్షణకు తన వంతు పూర్తి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.




