Parvathipuram: రేషన్ బియ్యం దొంగ నిల్వలపై కేసు నమోదు

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పౌర సరఫరా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 1470 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

V.SESHU	, KURUPAM
Published on: 5 May 2026 5:39 PM IST
Parvathipuram
X

Parvathipuram: రేషన్ బియ్యం దొంగ నిల్వలపై కేసు నమోదు

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరా అధికారి బండి అశోక్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.స్థానిక దుకాణలను పరిశీలించగా ఓ దుకాణం లో అక్రమంగా నిల్వ ఉంచిన 1470 కేజీల పీడీఎస్ బియ్యం ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతని పై కేసు నమోదు చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.

అదేవిధంగా గ్రామంలోని పలుచోట్ల కూడా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని నిబంధనలు ఉల్లంఘించి క్రయవిక్రయాలు చేస్తున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా పీ డీ ఎస్ బియ్యన్ని అక్రమంగా తరలించిన,నిల్వ చేసిన తమకు సమాచారం అందివ్వాలని అట్టి వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు .ఈ తనిఖీలలో సహాయ పౌర సరఫరాల అధికారి షేక్ ఇబ్రహీం మరియు ఆర్. ఐ శివ,సిబ్బంది పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story