Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో 'పీజీఆర్ఎస్' కార్యక్రమం రద్దు!

Parvathipuram: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పార్వతీపురం మన్యం జిల్లాలో పీజీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 18 Oct 2026 12:09 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో 'పీజీఆర్ఎస్' కార్యక్రమం రద్దు!

Parvathipuram: జిల్లాలో స్థానిక సంస్థల (మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమలులోకి వచ్చినందున, కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ మరియు డైలీ గ్రివెన్స్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి తెలిపారు.

ఈ ఎన్నికల కోడ్ అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 03 వరకు అమలులో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ గడువు ముగిసే వరకు ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గమనించాలని కోరారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)