Bhogapuram: ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం ప్రధాని మోదీ పర్యటన!
Bhogapuram: ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.
Bhogapuram: ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం ప్రధాని మోదీ పర్యటన!
Bhogapuram: ఆగస్టు 1 న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్న నేపద్యంలో, పర్యటనా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ముందుగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడి వేదిక ఏర్పాట్లు, వివిధ గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ తదితర వాటి గురించి సంబంధిత అధికారులతో చర్చించారు.
అనంతరం వీఐపీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. ట్రాఫిక్ కి ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని, పటిష్టమైన ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలను ఖరారు చేయాలని ఆదేశించారు. అంతకుముందు టెర్మినల్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి, కంట్రోల్ రూమ్ కి భవనాన్ని ఖరారు చేశారు.
ఈ పర్యటనలో జేసి సేధు మాధవన్, జిసిసి ఎండీ ఎస్ ఎస్ శోభిక, ట్రైనీ ఐఏఎస్ హరి ఓం పాండ్య, జిఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ రామరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




