పూతికవలస జంక్షన్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: సిఐ హరి
కురుపాం మండలం పూతికవలస జంక్షన్ వద్ద ఎల్విన్ పేట సిఐ హరి ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు.
పూతికవలస జంక్షన్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: సిఐ హరి
కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పూతికవలస జంక్షన్ వద్ద ఎల్విన్ పేట సిఐ హరి ఆధ్వర్యంలో కురుపాం ఎస్సై నారాయణ రావు మరియు నీలకంఠాపురం ఎస్సై నీలకంఠరావు లు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు .ఈ తనిఖీలలో వాహనాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసారు.ప్రత్యేకంగా హెల్మెట్ ధరించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, ఇన్సూరెన్స్ మరియు ఇతర వాహన పత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా వాహన చోదకులు,ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా సిఐ హరి మాట్లాడుతు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణ నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు.ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి ప్రత్యేక వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలాగే మైనర్ల కు వాహనాలు డ్రైవింగ్ కి ఇవ్వరాదని తెలిపారు .ఈ తనిఖీ లలో కురుపాం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




