Parvathipuram: గుమ్మలక్ష్మీపురంలో దొంగల బీభత్సం.. మహిళ మెడలో గొలుసు చోరీ!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో దొంగల బీభత్సం. నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసును లాక్కెళ్లిన దుండగులు.
Parvathipuram: గుమ్మలక్ష్మీపురంలో దొంగల బీభత్సం.. మహిళ మెడలో గొలుసు చోరీ!
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం లో పట్టపగలు దొంగల బీభత్సం సృష్టించారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో నుయ్యి వీధి లో నివాసముంటున్న సుజాత అనే మహిళా కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.రాత్రి తన ఇంటి వరండాలో నిద్రించారు. వేకువజామున సుమారు 4.30 గంటల సమయం లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమె మెడ లో గల 3 తులాల బంగారు గొలుసుని లాక్కున్నారు..దొంగలు చోరీకి యత్నించిన సమయంలో మహిళ ప్రతిఘటించడంతో మిగతా వస్తువులు విడిచిపెట్టి పరారయ్యారు. కుటుంబ సభ్యులు, వీధిలో వారు దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన అప్పటికే పరారయ్యారు. భాధిత మహిళ ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.వెంటనే ఎల్విన్ పేట సర్కిల్ ఇన్క్పెక్టర్ హరి తన సిబ్బంది తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎవరైన అనుమానితులు కనపడిన పోలీస్ శాఖ వారికీ తెలియజేయాలన్నారు.




