Parvathipuram: పార్వతీపురం వేదాంత కాలేజీలో విప్లవ, దేశభక్తి గేయాల ఆలపన

Parvathipuram: దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాటల రూపంలో గానం చేస్తూ ప్రజల్లో చైతన్యం తేవాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 20 July 2026 12:57 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం వేదాంత కాలేజీలో విప్లవ, దేశభక్తి గేయాల ఆలపన

పార్వతీపురం: దేశ సమస్యలను ప్రతి ఒక్కరూ గానం చేసి దేశ ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. చంద్రనాయక్ చిన్నం పెంచలయ్య జాతీయ నాయకులు గని పిలుపునిచ్చారు. మంగళవారం పార్వతీపురం వేదాంత కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి పాటలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

దేశం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను దేశభక్తి గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం అనేక సమస్యలతో సతమతమవుతుందని వాటిని పాటల రూపంలో గానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమస్యలను పాటల రూపంలో గానం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన చైతన్యం కలుగుతుంది అన్నారు.

భారమైపోతున్న బతుకులు జీవన విధానంపై వారు గేయాలు ఆలపించారు. సమాజంలో జరుగుతున్న అనేక రకాల సమస్యలను కాలేజీ దశలోనే విద్యార్థులు అవగాహన చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ స్పందించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు తెలిపారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story