Parvathipuram: వెంకంపేటలో నిరసనల సెగ: డంపింగ్ యార్డ్ వద్దు.. మాకు క్రీడామైదానం కావాలి!
Parvathipuram: పాలకొండ వెంకంపేటలో డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ పాఠశాల విద్యార్థులు, స్థానికుల నిరసన.
Parvathipuram: వెంకంపేటలో నిరసనల సెగ: డంపింగ్ యార్డ్ వద్దు.. మాకు క్రీడామైదానం కావాలి!
పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ వెంకంపేట పరిసరాల్లో డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని వెంకంపేట పాఠశాల విద్యార్థులు స్కూల్ విద్యార్థులు, స్థానిక యువత నిరసన తెలిపారు. పాలకొండ నగరపంచాయితీ పరిధిలో సేకరించిన చెత్తను వెంకంపేటలో డంపింగ్ చేస్తున్న నగరపంచాయితీ తీరును ఆ ప్రాంత వాసులతో కలిసి విద్యార్థులు, యువత ముక్తకంఠంతో ఖండించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద, మధ్యతరగతి వారు నివసిస్తారని అలాంటి చోట చెత్తను డంప్ చేయడం అన్యాయం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇక్కడ చాలా రోజులపాటు అప్రకటిత డంపింగ్ యార్డును నడిపి మా ప్రాంత వాసుల ఆరోగ్యాలతో నగరపంచాయితీ ఆడుకుందని, అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేసి ఇక్కడ నుండి అప్పటి డంపింగ్ యార్డును తొలగించేలా ఒత్తిడి తెచ్చి అప్పట్లో దీన్ని తరలించేలా చేశామని ప్రస్తుతం మళ్ళీ ఇక్కడే డంపింగ్ యార్డు కోసం నగరపంచాయితీ అధికారులు హడావిడిగా పనులు చేయడం మా ప్రాంతం పై పగపట్టడంలా ఉందని వెంకంపేట వాసులు వాపోతున్నారు.
శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చొరవతో వెంకంపేట పాఠశాల ఎలిమెంటరీ నుండి హై స్కూల్ గా మారుతున్న తరుణంలో ఆ డంపింగ్ యార్డు నిర్మాణం తలపెట్టిన ప్రాంతాన్ని క్రీడామైదానం గా పిల్లలకు కేటాయించి వారికి కానుకగా అందిస్తారని అంతా భావించిన తరుణంలో నగరపంచాయితీ వారు ఇక్కడ డంపింగ్ యార్డు, సీ అండ్ డి యూనిట్ నిర్మాణానికి అర్దరాత్రి పూట గుంతలు తవ్వడం అంటే విద్యార్థులు , స్థానికులకు తీవ్ర అన్యాయం చేయడమే అని విద్యార్థి సంఘాలు తెలియజేసాయి. ఇప్పటికైనా నగరపంచాయితీ కమిషనర్ నిర్ణయాన్ని పునరాలోచించి ఇక్కడనుండి డంపింగ్ యార్డును తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని స్థానికులు తెలిపారు.




