Garugubilli: ఖడ్గవలస జంక్షన్‌లో ప్రయాణిస్తున్నారా? జాగ్రత్త.. మీ కళ్లు పోయే ప్రమాదం!

Garugubilli: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ వద్ద రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న ఊక వాహనదారులకు శాపంగా మారింది.

V.SESHU	, KURUPAM
Published on: 12 May 2026 7:49 AM IST
Garugubilli
X

Garugubilli: ఖడ్గవలస జంక్షన్‌లో ప్రయాణిస్తున్నారా? జాగ్రత్త.. మీ కళ్లు పోయే ప్రమాదం!

గరుగుబిల్లి: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ వద్ద రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న ధాన్యపు పొట్టు (ఊక) వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డును ఆనుకొని ఉన్న రైస్ మిల్లులో మిల్లింగ్ అనంతరం వచ్చిన ధాన్యపు పొట్టు (ఊక)ను మిల్లు ఆవరణ బయటే నిల్వ చేస్తున్నారు. దీంతో స్వల్పంగా గాలి వీచినా ఊక రేగి రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారుల కళ్లలో పడుతోంది. హఠాత్తుగా చూపు మందగించడంతో వాహనాలను పక్కకు ఆపాల్సి వస్తోందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని వాహనచోదకులు వాపోతున్నారు.

ప్రధాన రహదారిపై ఉన్న ఈ జంక్షన్ గుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఊక సమస్యతో తరచూ ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు, వాహనదారులు తెలిపారు. మిల్లు యాజమాన్యం ఊకను కవర్లతో కప్పి ఉంచడం లేదా గోడౌన్‌లో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story