Cheepurupalli: చీపురుపల్లి పోతయవలస వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరికి గాయాలు
Cheepurupalli: చీపురుపల్లి మండలం పోతయవలస జంక్షన్ వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Cheepurupalli: చీపురుపల్లి పోతయవలస వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరికి గాయాలు
చీపురుపల్లి: చీపురుపల్లి మండలం పోతయవలస జంక్షన్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పి.ఎస్. లక్ష్మీపురం గ్రామానికి చెందిన జగ్గురోతు లక్ష్మీ నాయుడు, 62, తండ్రి పైడితల్లి తన మోటార్ సైకిల్ పై పోతయవలస గ్రామం నుండి వస్తుండగా, పోతయవలస జంక్షన్ వద్దకు చేరుకున్నారు.
అదే సమయంలో ఎదురుగా మోటార్ సైకిల్ పై వస్తున్న మీసాల నరసింహ నాయుడు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, లక్ష్మీ నాయుడు వాహనాన్ని బలంగా ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో జగ్గురోతు లక్ష్మీ నాయుడు కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతనిని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




