Tatipudi: జేఏ ఛానల్ పూడికతీత పనులు ప్రారంభం.. ఎస్.కోట ఎమ్మెల్యే!
Tatipudi: వేములాపల్లి వద్ద తాటిపూడి జలాశయం జేఏ ఛానల్ పూడికతీత పనులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి డీఎంఎఫ్ నిధులతో ప్రారంభించారు.
Tatipudi: జేఏ ఛానల్ పూడికతీత పనులు ప్రారంభం.. ఎస్.కోట ఎమ్మెల్యే!
తాటిపూడి: విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం వేములాపల్లి గ్రామం వద్ద తాటిపూడి జలాశయం జేఏ ఛానల్ పూడికతీత పనులను శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి మంజూరైన రూ.6 లక్షల వ్యయంతో ఈ పనులను చేపట్టారు.
ఛానల్ ఛైర్మన్ లగుడు ఎర్రినాయుడు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు రూ.4.5 కోట్లతో ఈ జేఏ ఛానల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి సుమారు 2,600 ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లోనూ జిల్లా గ్రాంట్ల ద్వారా ఈ నిధులను మంజూరు చేయించామని, అయితే ఆఖరి ఎకరా వరకు సాగునీరు అందాలంటే మధుపాడు నుంచి పూడికతీత పనులు జరగాల్సి ఉందని, వచ్చే ఏడాది లోపు మధుపాడు నుండి జాగరం ఛానల్ సిస్టమ్ వరకు పూర్తిస్థాయిలో పూడికతీత పనులు చేపట్టేలా డిపార్ట్మెంట్ అధికారులను నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.




