ఫినాయిల్ తాగి సచివాలయ ఉద్యోగిని మృతి
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో విషాదం చోటుచేసుకుంది.
ఫినాయిల్ తాగి సచివాలయ ఉద్యోగిని మృతి
కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని గుజ్జువాయి గ్రామానికి చెందిన కొండగొర్రి శైలజ (36) ఫినాయిల్ తాగి మృతి చెందినట్లు సమాచారం.
శైలజ ఇరిడి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆమె తన ఇంట్లో ఫినాయిల్ తాగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతురాలికి ఐదు నెలల చిన్నారి పాప ఉండటంతో ఈ ఘటన స్థానికులను కలచివేసింది. శైలజ మృతితో గుజ్జువాయి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




