Salur: శివరాంపురం జెడ్పీ స్కూల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Salur: సాలూరు మండలం శివరాంపురం జెడ్పీ స్కూల్‌ను కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి బెంచీపై కూర్చొని పాఠాలు విన్నారు.
Salur: శివరాంపురం జెడ్పీ స్కూల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సాలూరు: సాలూరు మండలం శివరాంపురం లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల సందర్శన సమయంలో కలెక్టర్ తరగతి గదిలోకి వెళ్ళి, సాధారణ విద్యార్థిలా బెంచీపై కూర్చొని ఉపాధ్యాయులు బోధిస్తున్న 'మన్యం ఇంగ్లీష్' డిజిటల్/స్మార్ట్ తరగతి పాఠాలను ఎంతో ఆసక్తిగా విన్నారు.
విద్యార్థులకు అందజేస్తున్న విద్య నాణ్యతను, బోధనా పద్ధతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయులు సైతం ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కిషోరి బాలికలకు "గుడ్ టచ్ - బ్యాడ్ టచ్" పై స్పష్టమైన స్పృహ కల్పించాలని, అలాగే బాల్య వివాహాల వలన కలిగే సామాజిక, ఆరోగ్యకరమైన అనర్థాల పట్ల విస్తృత అవగాహన కల్పించాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు హితవు పలికారు.
మండలంలోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా అధికారులు మరియు ప్రజలు 'మన మిత్ర' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ యాప్‌పై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్ర రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




