Salur: మామిడిపల్లిలో మెగా పీటీఎం 4.0 – పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

Salur: మామిడిపల్లి ప్రభుత్వ బడిలో మెగా పిటిఎం 4.0 లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

B VENKATESH, SALURU
Published on: 24 July 2026 6:35 PM IST
Salur
X

Salur: మామిడిపల్లిలో మెగా పీటీఎం 4.0 – పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

Salur: సాలూరు మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ - 4.0” లో గిరిజన శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం విద్యకు భరోసా కల్పిస్తోంది. సాలూరు నియోజకవర్గం: 30,146 మంది పిల్లలు – 22,348 మంది తల్లులు – రూ.45.21 కోట్లు.

పార్వతీపురం మన్యం జిల్లా మొత్తం: 1,15,001 మంది పిల్లలు – 81,598 మంది తల్లులు – రూ.172.50 కోట్లు.

పాఠశాలలో విద్యా వాతావరణాన్ని పరిశీలించిన మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

పిల్లలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నప్పుడు వారు ఏమి చూస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని, వారి చదువుపై దృష్టి పెట్టేలా మార్గనిర్దేశం చేయాలని మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు.

ప్రతి విద్యార్థి పెద్ద లక్ష్యాలను పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story