Salur: సాలూరు పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సంధ్యారాణి!
Salur: సాలూరు భాష్యం స్కూల్లోని తుఫాన్ పునరావాస కేంద్రాన్ని మంత్రి సంధ్యారాణి సందర్శించారు. బాధితులకు అందుతున్న వసతులపై అధికారులకు సూచనలిచ్చారు.
Salur: సాలూరు పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సంధ్యారాణి!
Salur: అర్నబ్ తుఫాను ప్రభావితుల కోసం పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసిన సాలూరులోని భాస్యం పాఠశాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సందర్శించారు.
ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు తదితర అవసరమైన సదుపాయాలు సక్రమంగా అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తుఫాను ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.




