Seetampeta: సీతంపేట కొండపై నాటు సారా తయారీ కేంద్రం ధ్వంసం

Seetampeta: సీతంపేట చిన్న బగ్గా కొండపై నాటు సారా తయారీ స్థావరంపై పోలీసుల దాడి. 750 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం, నిందితుల అదుపు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 14 July 2026 7:13 PM IST
Seetampeta
X

Seetampeta: సీతంపేట కొండపై నాటు సారా తయారీ కేంద్రం ధ్వంసం

సీతంపేట: చిన్న బగ్గా కొండపై అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు తన సిబ్బందితో దాడులు చేయగా సారాకు అవసరమైన 750 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్లు సీతంపేట ఎస్సై వై. అమ్మన్నరావు తెలిపారు.

ఈ దాడుల్లో 10 ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నాటు సారా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story