Kurupam: అక్రమంగా తరలిస్తున్న ఏడు పశువులు పట్టివేత.. వాహనం సీజ్!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న ఏడు పశువులను పోలీసులు పట్టుకుని బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు.
Kurupam: అక్రమంగా తరలిస్తున్న ఏడు పశువులు పట్టివేత.. వాహనం సీజ్!
పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం మండలం: అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని నీలకంఠాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో నీలకంఠాపురం గ్రామంలోని చర్చి ఎదురుగా ఎస్ఐ రమేష్ నాయుడు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో భామిని మండలం నుంచి పార్వతీపురం పశువుల సంతకు ఎటువంటి అనుమతులు లేకుండా ఏడు పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పశువులతో పాటు బొలెరో వాహనాన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు చిన్నారావు, త్రినాధులు పాల్గొన్నారు.




