Vizianagaram: సీతం ఇంజనీరింగ్ కాలేజీలో కెరీర్ గైడెన్స్ సదస్సు!
Vizianagaram: విజయనగరం సీతం ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల కోసం "ఎ బడ్డింగ్ ఇంజనీర్స్ స్టార్టర్ కిట్" అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
Vizianagaram: సీతం ఇంజనీరింగ్ కాలేజీలో కెరీర్ గైడెన్స్ సదస్సు!
విజయనగరం: స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం "ఎ బడ్డింగ్ ఇంజనీర్స్ స్టార్టర్ కిట్... ది వే ఫార్వర్డ్ "అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వివిధ విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు.పరిశ్రమ వర్గాల అంచనాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ అనలిస్ట్ మరియు ఇన్నోవేటర్ శ్రీ భాను పవన్ హాజరయ్యారు. తన సుదీర్ఘ పరిశ్రమ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకుంటూ, ఏకపక్ష ప్రసంగంలా కాకుండా విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఐటీ, ఇంజనీరింగ్ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రాధాన్యత మరియు ఉద్యోగ అవకాశాలలో వస్తున్న మార్పులను వివరించారు. కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్ మరియు ప్రాక్టికల్ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కివక్కానించారు.
కొత్తగా ఉద్యోగాల్లో చేరే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో సమస్య పరిష్కార నైపుణ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వం నియామక సంస్థలు ప్రధానంగా గమనిస్తాయని తెలిపారు. సర్టిఫికేషన్లు, ఇంటర్న్‌షిప్‌లు మరియు ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడం ద్వారా తమ ప్రొఫైల్‌ను ఏ విధంగా బలోపేతం చేసుకోవాలో విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునే నిరంతర విద్యార్థిగా మారాలని, జిజ్ఞాసతో ఈ రంగాన్ని అవగాహన చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ సదస్సు విద్యార్థులకు పరిశ్రమల అవసరాలపై స్పష్టమైన అవగాహనను అందించడంతో పాటు వారి కెరీర్ ప్రణాళికలకు ఎంతో ఉపయోగపడింది.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభ్యాసానికి, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు సీతం ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ నిరంతరం ఇటువంటి సదస్సులను నిర్వహిస్తుందని ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
ఈ సదస్సులో, డాక్టర్ టి. డి.వి.ఏ నాయుడు, చీఫ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫెసర్ సాయిరాం పట్నాయక్ మరియు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డి.అవినాష్ బాబు, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.




