Vizianagaram: విజయనగరం సీతం కళాశాలలో "సీతం సోనిక్ రేడియో స్టూడియో" ప్రారంభం

Vizianagaram: విజయనగరం సీతం కళాశాలలో "సీతం సోనిక్ రేడియో స్టూడియో"ను ప్రారంభించిన సెక్రెటరీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి. విద్యార్థుల సృజనాత్మకతకు అభినందనలు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 18 Aug 2026 2:46 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం సీతం కళాశాలలో "సీతం సోనిక్ రేడియో స్టూడియో" ప్రారంభం

Vizianagaram: స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో విద్యార్థులచే ఆవిష్కరించబడిన "సీతం సోనిక్ రేడియా స్టూడియో " కళాశాల సెక్రెటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి చేతుల మీదుగా ప్రాంభమైనది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయడంతో పాటు, వారి కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ మరియు డిజిటల్ మీడియా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ స్టూడియోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సదస్సులో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు సీతం సోనిక్ రేడియో స్టూడియో ద్వారా విద్యార్థులు పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు, చర్చా కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, వాయిస్ రికార్డింగ్స్ మరియు వివిధ రకాల డిజిటల్ కంటెంట్‌ను రూపొందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

విద్యార్థులు తమ ఆలోచనలు, ప్రతిభను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు ఇది ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని తెలిపారు.విద్యార్థులే స్వయంగా ముందుకు వచ్చి స్టూడియోను రూపొందించడం వారి సృజనాత్మక ఆలోచనా విధానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని కళాశాల సెక్రెటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అభినందించారు.

భవిష్యత్తులో మీడియా మరియు డిజిటల్ రంగాల్లో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో సీతం సోనిక్ రేడియా స్టూడియో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి రామ మూర్తి, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ముగిసింది.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story