Sitanagaram: లచ్చయ్యపేటలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
Sitanagaram: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేటలో అర్హులైన రైకులకు పాసుపుస్తకాలు అందజేసిన ఆర్డీవో మాధురి.
Sitanagaram: లచ్చయ్యపేటలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
సీతానగరం: సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి మాధురి బుధవారం పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రైతుల భూమి హక్కుల పరిరక్షణకు, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వేగంగా అందేందుకు ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తోందని తెలిపారు.
ప్రతీ రైతుకూ తమ భూములపై స్పష్టమైన హక్కులు ఉండేలా రెవిన్యూ యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. లబ్ధిదారులు ఈ పాసుపుస్తకాలను భద్రపరుచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, గ్రామ సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Next Story




