Srungavarapukota: సంతగవిరంపేటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటింటి ప్రచారం

Srungavarapukota: సంతగవిరంపేటలో డోర్ టు డోర్ ప్రచారం చేసిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. రూ.45 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల వివరాల వెల్లడి.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA
Published on: 28 July 2026 7:44 PM IST
Srungavarapukota
X

Srungavarapukota: సంతగవిరంపేటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటింటి ప్రచారం

శృంగవరపుకోట: శృంగవరపుకోట మండలం సంతగవిరంపేట గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రామంలోని ప్రతి గడపకూ తిరిగారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలుఎదుర్కొంటున్నసమస్యలనుప్రత్యక్షంగాఅడిగితెలుసుకుంటూ,కూటమిప్రభుత్వంఅధికారంలోకివచ్చినఈరెండుసంవత్సరల రెండు నెలల పాలనా కాలంలో ప్రజలకు చేకూరిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన దిశగా రూ.45 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్లనిర్మాణాల వివరాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు డోకుల అచ్చం నాయుడు, PACS చైర్మన్ గొర్రుపోటు సింహాచలం నాయుడు, పార్లమెంట్ అధికార ప్రతినిధి ఇందుకూరు శ్రీనురాజు, క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి వెంకన్న, ఎంపీటీసీ రాయవరపు చంద్ర శేఖర్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

Next Story