S.Kota: పుణ్యగిరి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం

S.Kota: ఉత్తరాంధ్ర చిన్న కాశీ పుణ్యగిరి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. శ్రీ ధార గంగమ్మ దేవస్థానం కొత్త కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే లలితకుమారి.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA
Published on: 13 Aug 2026 5:17 PM IST
S.Kota
X

S.Kota: పుణ్యగిరి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం

ఎస్.కోట: ఎస్.కోట మండలం పుణ్యగిరిలోని శ్రీ ధార గంగమ్మ, శివాలయం దేవస్థానం నూతన పాలకమండలి ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన కమిటీ సభ్యులకు దుశ్శాలువాలు కప్పి, ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్‌గా పి. అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేయగా, డైరెక్టర్లుగా బి.నాగరవీంద్రబాబు, పి. లక్ష్మీ దేవి, ఎన్. ఈశ్వరమ్మ, కె. కొండమ్మ, కె. అప్పారావు, ఎం. కృష్ణబాబు, బి. చంద్రశేఖర్, వై.అక్కు నాయుడు, కె.లక్ష్మి, కె. సంతోషి కుమారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఎ.రాజగోపాలాచర్యులు వ్యవహరిస్తున్నారు. కూటమి ధర్మానికి పెద్దపీట వేస్తూ జనసేన, బీజేపీలకు చెందిన ఒక్కొక్క నాయకుడికి పాలకమండలిలో చోటు కల్పించారు

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

Next Story