Salur: చిన్నపిల్లల ఈత సరదా ప్రాణాపాయం కావచ్చు.... శక్తి టీం సాలూరు
Salur: పాచిపెంట మండలం గడేవలస బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా ఈత కొడుతున్న పిల్లలను సురక్షితంగా ఇళ్లకు చేర్చిన సాలూరు శక్తి టీమ్ సిబ్బంది.
Salur: చిన్నపిల్లల ఈత సరదా ప్రాణాపాయం కావచ్చు.... శక్తి టీం సాలూరు
సాలూరు: వేసవి సెలవులు నేపథ్యంలో విద్యార్థులు, యువత,చిన్నారులు చెరువులు, కొలనులు, జలపాతాలు, నీటి కుంటలు, ఏరుల వద్దకు ఎవరూ ఈతకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సాలూరు శక్తి టీమ్స్ హెచ్ సి సీతయ్య మరియు ఎం మహిళా కానిస్టేబుల్ రాజహంస గారు పాచిపెంట మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాచిపెంట మండలం గడే వలస గ్రామం బ్రిడ్జి వద్ద ఉన్న నీటిలో ప్రమాదకర రీతిలో చిన్న పిల్లలు పెద్దవారి పర్యవేక్షణ లేకుండా ఈత కొట్టడం చూసి వారి వద్దకు వెళ్లి ఈ రకంగా పెద్దల పర్యవేక్షణ లేకుండా నీటిలో ఈత కొట్టడం ప్రాణాపాయమని వాళ్లకు వివరించి వారి తల్లిదండ్రుల వద్దకు పిల్లలను పంపించడం జరిగింది.
ఈత బాగా రాని వారు లోతైన నీటిలోకి వెళ్లడం, తెలియని ప్రాంతాల్లో ఈత కొట్టడం, స్నేహితుల ప్రోత్సాహంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని , వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ, వారు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ,చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని శక్తి టీం సిబ్బంది సూచించారు.




