Bobbili: డిమాండ్ జర్నలిస్టుల రక్షణ కోసం వెంటనే ప్రత్యేక చట్టం తేవాలి!

Bobbili: చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్ హత్య మరియు రిపోర్టర్లపై జరిగిన దాడులను నిరసిస్తూ బొబ్బిలిలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహించారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 30 April 2026 4:57 PM IST
Bobbili
X

Bobbili: డిమాండ్ జర్నలిస్టుల రక్షణ కోసం వెంటనే ప్రత్యేక చట్టం తేవాలి!

బొబ్బిలి: ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది మీడియాను భయపెట్టే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించకూడదని,బొబ్బిలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నారు.చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్ హత్య పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో సాక్షి రిపోర్టర్ శ్రీను, సివిఆర్ రిపోర్టర్ పై జరిగిన దాడులపై తరచూ విలేకరులపై జరుగుతున్న దాడులు, హత్యలపై నిరసనగా గురువారం గాంధీ బొమ్మ వద్ద ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా సంఘాల నాయకులు, నిరసన కార్యక్రమం చేశారు.

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్ వాకింగ్ చేస్తున్న టైం లో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సాలూరులో సాక్షి శ్రీను, సివిఆర్ పై అత్యంత కిరాతకంగా దాడి చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు ఎటువంటి త్రావలేదు అభిప్రాయ భేదాలు ఎవరికి ఉన్న సిద్ధాంత భేదాలు ఎవరికైనా ఉన్నప్పటికీ వాటిని ఇంకోరకంగా వేదికలపై వ్యక్యాకరించాలి తప్ప భౌతిక దాడులకు దిగడం గాని హత్యలకు పాల్పడటం కానీ చేయడం చాలా నేరం. కాబట్టి జర్నలిస్టులపై దాడులు చేస్తూ హత్యలు చేస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని, జర్నలిస్టులపై దాడులను ఆపాలని, దోషులకు కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story