Srungavarapukota: 108 అడుగుల బంగారు గణపతిని దర్శించిన గొంప కృష్ణ!
Srungavarapukota: 108 అడుగుల బంగారు గణేషుడిని దర్శించుకున్న DCMS చైర్మన్ గొంప కృష్ణ. విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొంది ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నాయకుడు.
Srungavarapukota: శృంగవరపుకోటలో 108 అడుగుల బంగారు గణపతిని దర్శించిన గొంప కృష్ణ!
Srungavarapukota: శృంగవరపుకోట మండల కేంద్రంలో కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన విఘ్నేశ్వరుని శృంగవరపుకోట నియోజక వర్గ యువ నాయకుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా Dcms చైర్మన్ శ్రీ గొంప క్రిష్ణ గారు దర్శించుకున్నారు. దీనిలో భాగంగా, శృంగవరపుకోటలో ఆకులు డిపో వద్ద "లంబోదర చారిటబుల్ ట్రస్ట్" వారి ఆధ్వర్యంలో కొలువుదీరిన 108 అడుగుల బంగారు గణేషుడిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. గొంప క్రిష్ణ గారికి కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువత తో ఫొటోలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలు అందరిపై ఆ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాక్షించారు.




