Kurupam: బల్లుకోట పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం బల్లుకోటలో ఎంపీపీ స్కూల్, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్.
Kurupam: బల్లుకోట పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్!
Kurupam: కురుపాం మండలం బల్లుకోట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎం.పి.పి. స్కూల్) మరియు అంగన్‌వాడీ కేంద్రాన్ని పాలకొండ సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవార్, ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్ విద్యార్థుల హాజరు, విద్యాబోధన తీరు, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో మెరుగైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, హాజరు వివరాలు, కేంద్రంలో ఉన్న సౌకర్యాలు మరియు సేవల అమలును పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న సబ్ కలెక్టర్, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన సౌకర్యాలు అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.




