Cheepurupalli: చీపురుపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి కిమిడి సంధ్య హోరెత్తిన ప్రచారం!
Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి కిమిడి సంధ్య ఘనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Cheepurupalli: చీపురుపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి కిమిడి సంధ్య హోరెత్తిన ప్రచారం!
Cheepurupalli: కాపుశంభాం ఎంపీటీసీ పరిధిలోని చుక్కవలస గ్రామం నుండి జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారు శనివారం తమ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు.
మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకటరావు గారి దిశానిర్దేశంలో, యువనేత, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం వైభవంగా సాగింది. ప్రచార ప్రారంభానికి గ్రామ ప్రజలు, కూటమి శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంక్షేమ ఆలోచనలతో, యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ గారి విజన్ తో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
చుక్కవలస అనంతరం కొండశంభాం, కాపుశంభాం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అక్కడ అభ్యర్థికి స్థానిక ప్రజలు, మహిళలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.
స్థానిక సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అభ్యర్థి కిమిడి సంధ్య గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




