Gurla: గుర్ల మండలంలో ఉత్సాహంగా టీడీపీ అభ్యర్థి వెన్నె సన్యాసినాయుడు నామినేషన్!

Gurla: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో టీడీపీ నేత వెన్నె సన్యాసినాయుడు ఎంపీటీసీ, ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు, నేతలు భారీగా హాజరయ్యారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 21 Oct 2026 12:59 PM IST
Gurla
X

Gurla: గుర్ల మండలంలో ఉత్సాహంగా టీడీపీ అభ్యర్థి వెన్నె సన్యాసినాయుడు నామినేషన్!

Gurla: గుర్ల మండలంలో టీడీపీ అభ్యర్థి వెన్నె సన్యాసినాయుడు నామినేషన్ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో టీడీపీలో ఉత్సాహం నెలకొంది. గుర్ల మండలం తెట్టంగి, పోలాయవలస గ్రామాల నుంచి టీడీపీ పార్టీ తరపున ఎంపీపీ అభ్యర్థిగా, ఎంపీటీసీ అభ్యర్థిగా వెన్నె సన్యాసినాయుడు నామినేషన్ వేశారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని వెన్నె సన్యాసినాయుడు తెలిపారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY