Gurla: మే 27, 28 తేదీల్లో టీడీపీ హైబ్రిడ్ మహానాడు..ఏర్పాట్లు ముమ్మరం!

Gurla: మహానాడు కార్యక్రమ క్లస్టర్ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 23 May 2026 5:36 PM IST
Gurla
X

Gurla: మే 27, 28 తేదీల్లో టీడీపీ హైబ్రిడ్ మహానాడు..ఏర్పాట్లు ముమ్మరం!

గుర్ల: ఈనెల 27, 28 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం నేపథ్యంలో ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. గుర్ల మండలంలోని క్లస్టర్-10 పరిధిలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి, నాయకులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా గరివిడి మండలంలోని 5వ క్లస్టర్ ఏర్పాట్లను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, "పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి. క్లస్టర్ స్థాయిలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి. గ్రామస్థాయి నుండి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలి" అని దిశానిర్దేశం చేశారు.

మహానాడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని నాయకులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story