Kurupam: కంటుగూడలో వాగుపై తాత్కాలిక వంతెన ఏర్పాటు!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కంటుగూడ గ్రామంలో విద్యార్థులు, రైతుల రాకపోకల సౌకర్యం కోసం పోలీసులు తాటి చెట్లతో తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు.
Kurupam: కంటుగూడలో వాగుపై తాత్కాలిక వంతెన ఏర్పాటు!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని కంటుగూడ గ్రామంలో వాగు దాటేందుకు విద్యార్థులు, గ్రామస్థులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ శ్రీ మాధవరెడ్డి, ఐపీఎస్ ఆదేశాలు, పాలకొండ ఎస్‌డీపీవో రాంబాబు సూచనల మేరకు ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. హరి ఆధ్వర్యంలో నీలకంఠాపురం ఎస్‌ఐ పి. రమేష్ నాయుడు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా వాగు దాటేందుకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో తాటి చెట్లతో తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు.
ఈ వంతెన ద్వారా విద్యార్థులు పాఠశాలలకు, రైతులు వ్యవసాయ పనులకు, గ్రామస్థులు తమ నిత్యావసర కార్యక్రమాలకు సులభంగా వెళ్లే అవకాశం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు దొర, త్రినాథ్, వేణు, కిరణ్, కొండలరావు, చిన్నారావు, హోంగార్డులు బాలకృష్ణ, రామారావు పాల్గొన్నారు




