Parvathipuram: సీసీ ఫుటేజీలో దొరికిన దొంగ.. నిందితుడి ఆచూకీ చెబితే రివార్డు!

Parvathipuram: గుమ్మలక్ష్మీపురం సంత వీధిలో గొలుసు దొంగతనం. నిందితుడి సీసీ ఫుటేజీని విడుదల చేసిన ఎల్విన్‌పేట పోలీసులు.

V.SESHU	, KURUPAM
Published on: 27 April 2026 8:03 AM IST
Parvathipuram
X

Parvathipuram: సీసీ ఫుటేజీలో దొరికిన దొంగ.. నిందితుడి ఆచూకీ చెబితే రివార్డు!

Parvathipuram: గుమ్మలక్ష్మీపురం సంత వీధిలో శనివారం నాడు తెల్లవారుజామున దొంగతనం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఓ మహిళ మెడలో మూడు తులాల బంగారము గొలుసును ఇద్దరు వ్యక్తులు దొంగలించి పారిపోయారు. ఈ మేరకు ఎల్విన్ పేట పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పై అనుమానం వచ్చి ఆ వ్యక్తి ఫోటోను ఎల్విన్ పేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి మాట్లాడుతూ. దొంగతనం జరిగిన రోజు ఓ సిసి ఫుటేజీల్లో ఈ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారని ఈ వ్యక్తి ఎక్కడైనా కనిపించిన ఈ నంబర్ 9248701917. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్.7981296171. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎల్విన్ పేటకు సమాసం ఇవ్వాలని ఇచ్చిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story