Vizianagaram: 'తిరంగా ర్యాలీ' ప్రారంభించిన MLA కళా వెంకటరావు!

Vizianagaram: విజయనగరం చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 15 Aug 2026 7:38 AM IST
Vizianagaram
X

Vizianagaram: 'తిరంగా ర్యాలీ' ప్రారంభించిన MLA కళా వెంకటరావు!

Vizianagaram: జాతీయ భావాన్ని చాటిచెప్పేలా చీపురుపల్లిలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.

బైక్ ర్యాలీ నుండి పాదయాత్ర వరకు, కళా వెంకటరావు గారు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం, పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున వాహనాలపై బయలుదేరి మూడు రోడ్ల కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఆ తర్వాత మూడు రోడ్ల కూడలి నుండి విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి "వందేమాతరం" అంటూ నినాదాలు చేసుకుంటూ గాంధీ బొమ్మ వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్లారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ర్యాలీని విజయవంతం చేశారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story