Parvathipuram: కాకర్లవలసలో ఉద్రిక్తత.. గిరిజనుల పంట పొలాల ధ్వంసం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కాకర్లవలసలో గిరిజనుల భూముల్లో పంట ధ్వంసం.. పోలీసులతో గిరిజనుల ఘర్షణ, నిరసనకారుల అరెస్ట్ తో ఉద్రిక్తత.

B VENKATESH, SALURU
Published on: 10 Sept 2026 8:48 PM IST
Parvathipuram
X

Parvathipuram: కాకర్లవలసలో ఉద్రిక్తత.. గిరిజనుల పంట పొలాల ధ్వంసం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కాకర్లవలస గ్రామ సమీపంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములను పోలీసుల అడ్డుకొని పంటను యంత్రాలతో ధ్వసం చేశారు కూటమి ప్రభుత్వం ఎసెంట్ డి పట్టా భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారా దత్తం చేసే భాగంలో 65 ఎకరాల భూమిని రాధిక విజిటేబుల్ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది.

అయితే పంట సాగు చేస్తున్న గిరిజన రైతుల భూములను అధికారులు పోలీసుల సహాయంతో పంట పొలాలు స్వాధీనం చేసుకునేందుకు ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది దీంతో విషయం తెలుసుకున్న గిరిజనులు అధికారులను నిలదీసి పంట చేతికొచ్చే సమయంలో భూములు స్వాధీనం చేసుకోవడం సరైనది కాదని అధికారులను నిలదీయడం జరిగింది.

దీంతో పోలీసులు గిరిజనుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరగడంతో అడ్డుకున్న ప్రశ్నించిన గిరిజనులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో గిరిజనులు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ విధంగా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ ఆ ప్రాంత గిరిజనులు తమ ప్రాణాలైనా అర్పిస్తాము గాని ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను వదులుకునే ప్రసక్తి లేదని తెలియజేశారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU