Konaseema: కోనసీమ జాయింట్ కలెక్టర్‌గా వైఖోమ్ నిడియా దేవి బాధ్యతలు స్వీకరణ

Konaseema: కోనసీమలో జాయింట్ కలెక్టర్‌గా వైఖోమ్ నిడియా దేవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 23 April 2026 1:15 PM IST
Konaseema
X

Konaseema

Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నూతన జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన వైఖోమ్ నిడియా దేవి గురువారం అమలాపురం కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ను వారి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలులో జాయింట్ కలెక్టర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది కలిసి నూతన జాయింట్ కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి మాట్లాడుతూ, ఈ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్ఓ ఎ. ఉదయభాస్కర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి. శ్రీనివాస్, ఎల్‌డీఎం కేశవ వర్మ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story