Terlam: కామ్రేడ్ వెంపటాపు సత్యం విగ్రహావిష్కరణ!

Terlam: విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఎన్. బూర్జవలస గ్రామంలో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట యోధుడు వెంపటాపు సత్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 10 July 2026 1:07 PM IST
Terlam
X

Terlam: కామ్రేడ్ వెంపటాపు సత్యం విగ్రహావిష్కరణ!

Terlam: బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం ఎన్. బూర్జవలస గ్రామంలో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట అమరుడు, ప్రజా ఉద్యమ నాయకుడు కామ్రేడ్ వెంపటాపు సత్యనారాయణ (సత్యం) విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె. రంగారావు (బేబీ నాయన), ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన వారు వెంపటాపు సత్యం గిరిజనులు, రైతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రజా నాయకుడని కొనియాడారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చూపిన పోరాట పటిమ, నిబద్ధత ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు.

కార్యక్రమంలో వెంపటాపు సత్యం కుమార్తె వెంపటాపు భారతి పాల్గొని భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి సేవలను గుర్తించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఆయన ఆశయాలను ప్రజలు చిరకాలం గుర్తుంచుకోవాలని కోరారు. తన తండ్రికి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, అభిమానులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వెంపటాపు సత్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన గిరిజన రైతాంగ ఉద్యమంలో పోషించిన పాత్రను స్మరించుకుంటూ పలువురు నాయకులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంపటాపు సత్యం త్యాగాలు, ప్రజాసేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగ వాతావరణంలో సాగింది.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story