Parvathipuram: పార్వతీపురంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ షురూ!

Parvathipuram: పార్వతీపురం పట్టణంలోని డివిఎంఎం పాఠశాలలో సమగ్ర శిక్ష సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ జరిగింది.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 15 Jun 2026 3:40 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ షురూ!

పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని డివిఎంఎం పాఠశాల వద్ద సమగ్ర శిక్ష సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలిపారు.

గతంలో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం దివ్యాంగులకు కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. వారికి తోడుగా వెళ్లే వారికి 50% రాయితీ చార్జీని ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 125 మున్సిపాలిటీల్లో ఆర్టిజెన్స్ థెరపీస్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. నవచేతన కార్యక్రమం ద్వారా పిల్లల్లో లోపాలను ముందుగానే గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

అలాగే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున కృత్రిమ అవయవాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బ్రహ్మాజీ రావు, ఎంఈఓలు విమల కుమారి, ప్రసాద్ రావు, సమగ్ర శిక్ష అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story