Cheepurupalli: చీపురుపల్లిలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి 200 కుటుంబాలు

Cheepurupalli: చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం పెదమజ్జిపేటకు చెందిన 200 కుటుంబాలు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 1 Oct 2026 7:33 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: చీపురుపల్లిలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి 200 కుటుంబాలు

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గుర్ల మండలం, కోట గండ్రేడు పంచాయతీ, పెదమజ్జిపేట గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.

బుధవారం మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు సమక్షంలో ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీటీసీలు ముద్దాడ కేశవ రావు, ఉప్పిశెట్టి అప్పల స్వామి తమ అనుచరులతో కలిసి, అంబటి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరందరికీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై తాము టీడీపీలో చేరుతున్నట్లు చేరికల్లో పాల్గొన్న నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY