Vizianagaram: పార్టీ మార్పులపై బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు

Vizianagaram: విజయనగరం వైఎస్సార్‌సీపీ సమావేశంలో బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు. విలువలతో రాజకీయం చేయాలంటూ పార్టీ మారుతున్న నేతల తీరుపై మండిపాటు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 12 Sept 2026 5:00 PM IST
Vizianagaram
X

Vizianagaram: పార్టీ మార్పులపై బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు

విజయనగరం: విజయనగరం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలి అంటూ.. చిన్న శ్రీను పార్టీ మార్పుపై పరోక్షంగా బొత్స విమర్శించారు.

నైతిక విలువలు లేనివారు ఎంతటికైనా దిగజారుతారు..ఆ దిశలోనే వారు ఇలాంటి పని చేస్తారని ఆయన అన్నారు.ఓ సెంట్రల్ మినిస్టర్ వచ్చి నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు.విలువలకు కట్టుబడి ఉన్నవాడిని కనుక వారికి నో చెప్పాను‌ అంటూ బొత్స పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు.

రాబోయే కాలంలో వచ్చే పరినామాలు, కార్యక్రమాలు ఏం చెయ్యాలననే విషయాన్ని ఆయన దిశా నిర్దేశం చేశారు.క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యడానికి కమీటిలు వేయడం,వెన్నుపోటు పార్టీ అధికారంలోకి రావటానికి ఎలాంటి హామీలు ఇచ్చారు. ప్రజలకు ఎలా మోసం చేశారో చెప్పాలి, అంటూ సమావేశంలో బొత్స వైసిపీ శ్రేణులకు తెలిపారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.