Vizianagaram: గరివిడి పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Vizianagaram: కొండపాలెం పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రామ సుందరరెడ్డి. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన వైనం.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 15 July 2026 7:36 PM IST
Vizianagaram
X

Vizianagaram: గరివిడి పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కొండ పాలెం: గరివిడి మండలం కొండ పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎస్. రామ సుందరరెడ్డి గారు ఆకస్మిక తనిఖీ చేశారు.

6వ తరగతి విద్యార్థుల ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్ గారు, వారు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పిల్లలను మరియు వారికి పాఠం చెబుతున్న బి. కిషోర్ కుమార్ గణిత ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా అభినందించారు.

పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆయన, ఒక ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులతో అందరూ ఉత్తీర్ణులు కావాలని సూచించారు.

అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతుల గురించి ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

తదుపరి కొండ పాలెం మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూలును తనిఖీ చేసి 5వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వారి ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి దాతలను గుర్తించి వారి సహకారం తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గరివిడి మండల తహసిల్దార్ శ్రీ CH. బంగారు రాజు గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. రాము గారు, శ్రీమతి K. విజయ గౌరీ గారు తదితరులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story