Vizianagaram: 41 విద్యాసంస్థల్లో విస్తృతంగా మొక్కల పెంపకం – కలెక్టర్

Vizianagaram: విజయనగరంలో 41 విద్యాసంస్థల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. నెట్‌జీరో హెల్తీ క్యాంపస్‌గా తీర్చిదిద్దాలన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 4 Sept 2026 11:26 PM IST
Vizianagaram
X

Vizianagaram: 41 విద్యాసంస్థల్లో విస్తృతంగా మొక్కల పెంపకం – కలెక్టర్

విజయనగరం: నెట్‌జీరో హెల్తీ క్యాంపస్‌ తరహాలో జిల్లాలోని విద్యాసంస్థల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థలు, హాస్టళ్లతో పాటు కేజీబీవీల్లో అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్‌ నిర్వహించాలని సూచించారు.

శుక్రవారం వెబెక్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 9 ఏపీఎం పాఠశాలలు, 2 ఏపీఆర్‌ పాఠశాలలు, 7 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాలు, 6 బీసీ సంక్షేమ హాస్టళ్లు, 5 గిరిజన సంక్షేమ హాస్టళ్లు, 12 కేజీబీవీ పాఠశాలలు కలిపి మొత్తం 41 విద్యాసంస్థల్లో మొక్కల పెంపకం చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోని 9 ప్రాంతాల్లో కూడా ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత శాఖల పీడీలు, డీడీలు, డీఈఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు ప్లాంటేషన్‌ కార్యక్రమాలను పర్యవేక్షించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డ్వామా పిడి శారదాదేవి, సంక్షేమశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story