Vizianagaram: దత్తిరాజేరులో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-ఆటో ఢీకొని ముగ్గురు మృతి!
Vizianagaram: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజి వద్ద లారీ-ఆటో ఢీకొన్న ఘోర ప్రమాదం. ముగ్గురు అక్కడికక్కడే మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు.
Vizianagaram: దత్తిరాజేరులో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-ఆటో ఢీకొని ముగ్గురు మృతి!
Vizianagaram: గజపతినగరం నియోజకవర్గం, దత్తి రాజేరు మండలం షికారుగంజి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం 5:15 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పెదమానాపురం వైపు నుండి రాంభద్రపురం వెళ్తున్న AP 39 TF 1672 నంబర్ గల ఆటోను, ఎదురుగా రాంభద్రపురం వైపు నుండి వస్తున్న CG 04 PE 3645 నంబర్ గల లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు గునుపూరు తిరపతి30స" మరియు తెర్లి ఆదినారాయణ 62స" వీరు గజరాయని వలస గ్రామానికి చెందిన వారు కాగా మరియొక వ్యక్తి గుడ్ల రాము 40స"పెదమనాపరానికి చెందినవాడు వీరు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న బూర్జి వలస పోలీసులు మరియు బొబ్బిలి డి.ఎస్.పి సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తును కొనసాగిస్తూ మృతదేహాలను గజపతినగరం ప్రాంత ఆసుపత్రికి తరలించారు.




