Vizianagaram: గుర్లలో రోడ్డు భద్రతపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ ప్రాధాన్యతపై ఎస్ఐ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Vizianagaram: గుర్లలో రోడ్డు భద్రతపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
Vizianagaram: ఈరోజు గుర్లలో హెల్మెట్ ధరించడం మరియు రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటించడం పై అవగాహన సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి గుర్ల SI P. నారాయణరావు గారు మాట్లాడుతూ, హెల్మెట్ ప్రాణరక్షకమని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా అనుసరించి సురక్షిత ప్రయాణం చేయాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story




