Vizianagaram: విజయనగరం మేయర్ కూటమి అభ్యర్థిగా అవనాపు భార్గవి ఖరారు!

Vizianagaram: విజయనగరం మేయర్ కూటమి అభ్యర్థిగా బీసీ నేత అవనాపు భార్గవిని ప్రకటించడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కూటమి నేతలు సమావేశమయ్యారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 17 Oct 2026 2:42 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం మేయర్ కూటమి అభ్యర్థిగా అవనాపు భార్గవి ఖరారు!

Vizianagaram: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయనగరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర MSME, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిసెట్టి బాబ్జీ, విజయనగరం మేయర్ కూటమి అభ్యర్థిగా ప్రకటించిన అవనాపు భార్గవి తదితర కూటమి నేతలు పాల్గొన్నారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్..

విజయనగరం మేయర్ క్యాండిడేట్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అవనాపు భార్గవిని ప్రకటించడం అభినందనీయం.. అన్ని సామాజిక వర్గాల్లో నాయకత్వాన్ని పెంపొందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, అందులో భాగంగానే బీసీ మహిళకు ఈ అవకాశం కల్పించారు..

అవనాపు భార్గవి కుటుంబం జిల్లాలో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి ఆమె కుటుంబం మరియు తన వంతు కృషి చేశారు..

రాజకీయ అవకాశం అనేది ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక బీసీ మహిళకు ఇటువంటి అవకాశం రావడం నిజంగా హర్షించదగ్గ విషయం..

విజయనగరం పట్టణ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి నేతలందరూ సమన్వయంతో పనిచేసి అవనాపు భార్గవికి భారీ విజయం చేకూర్చాలి.. కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ తనవంతు భాగస్వామ్యం కావాలి.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.