Vizianagaram: అక్వాన్ తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి!

Vizianagaram: అక్వాన్ తుపాను దృష్ట్యా ఈ నెల 22 వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 18 Nov 2026 5:25 PM IST
Vizianagaram
X

Vizianagaram: అక్వాన్ తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి!

Vizianagaram: అక్వాన్ తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. తుపాను తీవ్రతపై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 22 వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని మంత్రి చెప్పారు. జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. తుపాను బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆ కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు.

తీర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా బయటకు రావొద్దని మంత్రి హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, సముద్రంలో ఉన్న బోట్లు తీరానికి చేర్చాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. నది పరివాహ ప్రాంతాల్లో మరియు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు సందర్శకులు రావొద్దని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్, రోడ్లు, తాగునీరు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని సూచించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.