Vizianagaram: విజయనగరంలో 26% పెరిగిన విద్యుత్ వినియోగం మంత్రి కొండపల్లి

Vizianagaram: విజయనగరం జిల్లాలో ఎల్‌నినో వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ వినియోగం 26% పెరిగింది. కోతలు తగ్గించి నిరంతర సరఫరాకు చర్యలని మంత్రి కొండపల్లి స్పష్టం.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 10 Sept 2026 9:35 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరంలో 26% పెరిగిన విద్యుత్ వినియోగం మంత్రి కొండపల్లి

విజ‌య‌న‌గ‌రం: ఎల్‌ నినో ప్ర‌భావంతో జిల్లాలో నెల‌కొన్న అధిక‌ ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో గ‌త యేడాదితో పోలిస్తే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగింద‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతోందని మంత్రి తెలిపారు. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని బుధ‌వారం జ‌రిగిన సమావేశంలో గౌర‌వ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ గారు ఏపీ జెన్‌కో అధికారులను ఆదేశించినట్లు మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు.

ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ కోతలను తగ్గించి, రానున్న రోజుల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కొండ‌ప‌ల్లి స్పష్టం చేశారు.

విద్యుత్ వినియోగం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని.. అవసరం లేని సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి విద్యుత్ పొదుపులో భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story