Vizianagaram: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అంకురార్పణ!

Vizianagaram: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి మొదటి అంకం మొదలైంది. జొన్నవలసలో సిరిమాను, ఇరుసుమాను చెట్లను గుర్తించి ప్రత్యేక పూజలు చేశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 5 Oct 2026 2:55 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అంకురార్పణ!

Vizianagaram: విజయనగరం గ్రామ దేవత, ఉత్తరాంధ్ర ఇలవేల్ల్పు శ్రీ పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవానికి మొదటి అంకం మొదలయింది.2026 శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరకు సంబందించి ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు స్వప్నంలో చెప్పడంతో విజయనగరం రూరల్ మండలం జొన్నవలసకు చెందిన రైతు బూర్లె రవి కల్లంలో ఈసారి సిరిమాను మరియు ఇరుసుమాను చెట్టు సాక్షాత్కరించింది.జంటగా పుట్టిన 15 అడుగుల చింతచెట్లను గుర్తించిన చెట్టుకు బొట్టు పెట్టి పూజలు నిర్వహించారు.

దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు హాజరైన ఈ క్రమంలోనే సిరిమాను చెట్టుకు పూజలు చేయడానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. అంతే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి చెట్టుకు పూజలు చేసారు. తమ గ్రామంలోని చెట్లను అమ్మ వారు సూచించడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. జంటగా పుట్టిన 15 అడుగుల చింతచెట్లను పైడితల్లి అమ్మ వారి సిరిమానుకు ఉపయోగిం చ నున్నారు. ప్రతి ఏటా దసరా తరువాత పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవం జరుగుతుంది.దీంతో నెలరోజుల ముందు నుంచే విజయనగరంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయనగరం రాజవంశానికి చెందిన శ్రీ పైడితల్లి అమ్మ వారు తమ గ్రామంలో చెట్లను కోరుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అమ్మ వారి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని భక్తులు వేడుకుంటున్నారు.

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం,దీంతోనే అమ్మ వారి సిరిమానోత్సవానికి విజయనగరం ముస్తాబవుతోంది. సిరిమానుకు చెట్టును గుర్తించడంతో మొదలైన పండుగ సిరిమానోత్సవంతో ముగియనుంది.దీంతో భక్తులు పైడితల్లి అమ్మ వారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ భక్తి పారవశ్యాన్ని పొందుతుంటారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.