Vizianagaram: గూగుల్ క్యాంపస్ అంబాసిడర్లుగా విజయనగరం సీతం విద్యార్థినులు!

Vizianagaram: విజయనగరం సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (సీతం) కళాశాలకు చెందిన నలుగురు బీటెక్ సీఎస్ఈ విద్యార్థినులు గూగుల్ క్యాంపస్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 13 Nov 2026 5:48 PM IST
Vizianagaram
X

Vizianagaram: గూగుల్ క్యాంపస్ అంబాసిడర్లుగా విజయనగరం సీతం విద్యార్థినులు!

Vizianagaram: సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (సీతం), విజయనగరానికి చెందిన బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) చివరి సంవత్సరం విద్యార్థినులు హేమశ్రీ, మౌనిక, భువన, ఉష ప్రతిష్ఠాత్మక గూగుల్ క్యాంపస్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు.

సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణల పట్ల అభిరుచిని గుర్తించి వీరికి ఈ అవకాశం లభించింది. క్యాంపస్ అంబాసిడర్లుగా ఎంపికైన విద్యార్థినులు గూగుల్ ఆధ్వర్యంలో చేపట్టే సాంకేతిక కార్యక్రమాల్లో భాగస్వాములవడంతో పాటు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తోటి విద్యార్థులకు పరిచయం చేసి, వారిలో సాంకేతిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కృషి చేయనున్నారు.

ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ వేణుమాధవ్, ప్లేస్‌మెంట్ విభాగం ప్రతినిధులు డాక్టర్ సాయిరాం పట్నాయక్, అవినాష్, సందీప్ విద్యార్థినులను అభినందించారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ సాంకేతిక సమాజంతో అనుసంధానం పెంపొందించుకోవాలని, తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నలుగురు విద్యార్థినుల ఎంపిక కళాశాలకు గర్వకారణమని, వారి విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.