Salur: పదవి కోసం పెళ్లి..? సాలూరులో జోరుగా సాగుతున్న ఆసక్తికర రాజకీయ చర్చ!

Salur: సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ మాజీ కౌన్సిలర్ హర్షవర్ధన్ వివాహం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.

B VENKATESH, SALURU
Published on: 13 Oct 2026 5:36 PM IST
Salur
X

Salur: పదవి కోసం పెళ్లి..? సాలూరులో జోరుగా సాగుతున్న ఆసక్తికర రాజకీయ చర్చ!

సాలూరు: సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పట్టణంలో ఓ వివాహం రాజకీయ చర్చకు దారితీసింది.

టీడీపీ మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ తన ప్రేయసి గుళ్ల మంజీరను వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.

అయితే, చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయిన నేపథ్యంలోనే ఈ వివాహం జరిగిందా అన్న చర్చ స్థానికంగా మొదలైంది. పదవిని దృష్టిలో పెట్టుకునే పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం సాగుతోంది.

నిజంగానే చైర్‌పర్సన్ పదవి కోసమే ఈ వివాహం జరిగిందా, లేక ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమా అన్నది ఇప్పుడు సాలూరులో చర్చనీయాంశంగా మారింది.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU