Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గంలో కూటమి జెండా ఎగురవేస్తాం!

Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించి మండల పరిషత్‌లను కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ధీమా వ్యక్తం చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 22 Oct 2026 12:45 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గంలో కూటమి జెండా ఎగురవేస్తాం!

Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, మండల పరిషత్‌లను కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్వతీపురంలోని ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీటీసీ నామినేషన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షురాలు, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు ఆగురుమణి నర్సీపురం-2 ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెతో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.

పంచాయతీల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా సాగలేదని, తాగునీటి సమస్యలతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టడంతో పాటు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జిల్లా పరిషత్తుల్లోనూ కూటమి విజయం సాధించి, గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గొట్టాపు గౌరీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)