Palakonda: ఎండలో ఎండుతున్న కూలీలు.. మజ్జిగ, టెంట్లు ఎక్కడ?

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 7 May 2026 11:56 AM IST
Palakonda
X

Palakonda: ఎండలో ఎండుతున్న కూలీలు.. మజ్జిగ, టెంట్లు ఎక్కడ?

పాలకొండ: పాలకొండ మండలం వేసవి ఎండలో ఎండుతున్న ఉపాధి కార్మికులు టెంటు మజ్జిగ మంచినీరు మౌలిక సౌకర్యాలు ఎక్కడ ఉపాధి హామీలో ఫేస్ యాప్ రద్దు చేయాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వెలగవాడ గ్రామ ఉపాధి కూలీలకు పని తక్షణమే కల్పించాలన సంవత్సరానికి 200 రోజులు పని దినాలు ఇవ్వాలి, రెండు పూటలా పని రద్దు చేయాలి, రోజుకూలీ 600 రూపాయలు ఇవ్వాలి పని ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దూసి దుర్గారావు డిమాండ్ పాలకొండ మండలం వెలగవాడ గ్రామీణ ఉపాధి కూలీలను ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దూసి దుర్గారావు మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బిజి గ్రామ్ జి ఉపాధి హామీ చట్టం వలన ఇప్పటికే ఉపాధి కూలీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఫేస్ యాప్ పెట్టడం వలన కూలీలు మస్తరు పడక, ఫోటో పడకపనికి వెళ్లిన, పని చేసిన, హాజరు లేక కూలి రావడంలేదని ఇది దుర్మార్గమైన పరిస్థితిని అన్నారు వెంటనే ఫేస్ యాప్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ఉపాధి పని చేసిన వారికి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని, రెండు పూటలా పని రద్దు చేయాలని ,వేసవి అలవెన్సులు ఇవ్వాలని, మంచినీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పారా, పలుగు ,తట్లకు, మెయింటెనెన్స్ డబ్బులు వేయాలని పని ప్రదేశాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సమ్మర్ మార్చిలో 30 ఏప్రిల్ నెలలో 40 మే, జూన్ నెలలో 50 సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి.

మేట్లకు ప్రోత్సాహం, సెల్ ఫోన్లు ఇవ్వాలి,ప్రతికూలికి పది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే వ్యవసాయంలో రోజు రోజుకి పని దినాలు తగ్గడం వలన వ్యవసాయ కూలీలకు పేద రైతులకు పని లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని వలసలు అరికట్టడానికి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర ములో పి సత్యవతి, పి దుర్గమ్మ, ,పి జయలక్ష్మి ,అన్నపూర్ణమ్మ , అంకమ్మ సావిత్రమ్మ వెంకటలక్ష్మి , ఉపాధి కూలీలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story